కావలసిన పదార్థాలు :
కాకరకాయలు... 1 కిలో
చింతపండు... 1/4 కిలో
ఉప్పు... 1 డబ్బా
కారం... సరిపడా
నూనె... 350 గ్రా
తయారీ విధానం :
ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండు, నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఆరిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాండీలో నూనె పోసి కాకరకాయ ముక్కలు వేసి కరకరలాడే వరకు వేయించాలి. అవి వేగిన తరువాత ఒక పళ్ళెంలో ఈ ముక్కలు, చింతపండు రసం, కారం అన్నీ కలిపాలి.
తరువాత ఆ మిగిలిన నూనెలో తాలింపు పెట్టి ఆరిన తరువాత అందులో పోసి కలపాలి. అంతే కాకరకాయ పచ్చడి రెడీ. ఇది బాగా ఆరిన తరువాత డబ్బాలో పోసి ఉంచుకుంచే చాలా రోజుల వరకూ నిలువ ఉంటుంది. ఈ పచ్చడి మధుమేహ రోగులకు చాలా మంచిది కూడా.