ఉసిరితో వెరైటీ "అచరి ఆమ్ల సబ్జి"
కావలసిన పదార్థాలు :ఉసిరికాయలు.. ఎనిమిదిటొమోటోలు.. నాలుగుఅల్లంవెల్లుల్లి.. రెండు టీ.కరివేపాకు.. 20 రెమ్మలుపసుపు.. అర టీ.ధనియాలపొడి.. అర టీ.పంచదార.. 2 టీ.ఉప్పు.. తగినంతనూనె.. 4 టీ.ఇంగువ.. చిటికెడుసోంపు.. ఒక టీ.మెంతులు.. అర టీ.ఆవాలు.. అర టీ.తయారీ విధానం :స్టవ్‌మీద పాత్ర పెట్టి అరలీటరు నీళ్లు పోసి అరటీస్పూను ఉప్పు, 2 టీస్పూన్ల పంచదార వేసి మరిగించాలి. అందులో ఉసిరికాయ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. ఆపై నీళ్లన్నీ వంపేసి ముక్కల్ని పక్కన ఉంచాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక అల్లంవెల్లుల్లి, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు సోంపు, మెంతులు, ఇంగువ, ఆవాలను వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి అరనిమిషం వేయించాలి. టొమాటో ముక్కల్ని కూడా పై మిశ్రమంలో వేసి నూనె పైకి తేలేవరకూ వేయించాలి. అందులోనే ఉడికించిన ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసి కలుపుతూ తక్కువ మంటమీద ఓ పది నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే అచరి ఆమ్ల సబ్జీ తయార్..! దీన్ని వేడివేడిగా అన్నంలోకి వడ్డిస్తే చాలా టేస్టీగా ఉంటుంది.