Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉడిపి స్పెషల్ "బనానారవ్వ స్వీటు బాత్‌"

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ... అర కేజీ
ఎసరునీరు... అర లీ.
పంచదార... 600 గ్రా.
అరటిపండ్ల గుజ్జు... నాలుగు
నెయ్యి... 200 గ్రా.
చిక్కగా మరిగించిన పాలు... 2 కప్పులు
జీడిపప్పు... 25 గ్రా.
కిస్‌మిస్... 25 గ్రా.
యాలకుల పొడి... ఒక టీ.
ఉప్పు... చిటికెడు

తయారీ విధానం :
బాణలిలో రవ్వ వేసి దోరగా వేయించాలి. ఎసరు మరిగించి 2 కప్పుల పాలు పోసి యాలకుల పొడి, రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. అందులో అరటిపండు గుజ్జు, పంచదార, ఉప్పు వేసి నెయ్యి పోస్తూ కలుపుతూ సన్నసెగ మీద మగ్గనిచ్చి, దోరగా వేయించిన జీడిపప్పు, ఎండు కిస్‌మిస్‌ పండ్లు చల్లితే బనానా కేసరి రెడీ..! ఉడిపిలో చాలా స్పెషల్‌గా చేసే ఈ వంటకాన్ని అక్కడివారు చాలా ఇష్టంగా తింటుంటారు.

Share this Story:

Follow Webdunia telugu