ఆలూ పకోడిలో ప్రోటీన్లు ఎక్కువట!: ఎలా తయారు చేయాలి?
, గురువారం, 13 డిశెంబరు 2012 (18:28 IST)
ఆలూ అంటేనే పిల్లలు తెగ ఇష్టపడి తింటారు. ఆలూను ఎప్పుడూ తాలింపులా పిల్లలకు పెట్టేకంటే పకోడీల్లా సర్వ్ చేస్తే పిల్లలు లొట్టలేసుకుని మరీ తింటారు. ఆలూను ఆహారంలో తీసుకోవడం ద్వారా పిల్లలక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్లు అధికంగా కలిగిన ఆలూను పిల్లలు తీసుకుంటే పుష్టిగా వుంటారు. కావలసిన పదార్థాలు: ఆలూ దుంపలు: అరకిలోశనగపిండి: అరకేజీకొత్తిమీర తురుము : రెండు టీస్పూన్లు నూనె : తగినంత. ఉల్లిపాయల తరుగు : అరకప్పుకరివేపాకు తురుము : రెండు టీస్పూన్లుపచ్చిమిర్చి తురుము : రెండు టీస్పూన్లుఉప్పు : తగినంత నీళ్లు : తగినన్నిఅల్లం గుజ్జు : టీ స్పూను. కారం : అర టీ స్పూను. జీలకర్ర : అర టీ స్పూను. తయారీ విధానం: ముందుగా ఆలూ దుంపలను ఉడికించి జల్లించిన శనగపిండిలో వేసి కలపాలి. ఉల్లి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి, అల్లం తురుము, కారం, జీలకర్ర, ఉప్పు, అన్నీ వేసి ఇందులో కలపాలి. తర్వాత కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీనికి తగినంత నీటిని కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ పిండిముద్దను కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేయించి.. టమోటా సాస్‌తో సర్వ్ చేయాలి.