కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు... 4 కేజీలు
వెల్లుల్లి పాయలు... ఒక కప్పు
కారం... ఒక కేజీ
ఆవపిండి... పావు కేజీ
పసుపు... తగినంత
ఉప్పు... పావు కేజీ
మంచినూనె... ఒక కేజీ
తయారీ విధానం :
ఉసిరికాయలు ఏ మాత్రం మెత్తబడినా పచ్చడికి పనికిరావు కాబట్టి తాజాగా, గట్టిగా పెద్దసైజులో ఉన్నవాటినే ఎంపిక చేసుకోవాలి. పెద్ద మూకుడును పొయ్యిమీద పెట్టి కొంచెం నూనె వేసి కాయలు కొద్దిగా మెత్తబడేదాకా వేయించాలి. ఒక పెద్ద గిన్నెలో ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు, వేయించిన ఉసిరికాయలను వేసి బాగా కలియబెట్టాలి. పొడిగా ఉన్న జాడీలో మిగిలిన నూనెను పోసి అందులో రెబ్బలు తీసి వెలుల్లిని వేయాలి.
ఈ జాడీలో ఉసిరికాయల మిశ్రమాన్ని వేసి కలియదిప్పి మూతపెట్టాలి. అంతే ఉసిరికాయ పచ్చడి రెడీ అయినట్లే... అయితే దీన్ని మూడు రోజులపాటు కదపకుండా అలాగే ఉంచిన తరువాత వాడుకుంటే రుచిగా ఉంటుంది.