అచ్చు మురుకులను ఎలా తయారు చేస్తారు?
కావలసిన పదార్థాలు : బియ్యం పిండి : ఒక కప్పు, మైదా పిండి : అర కప్పు, శెనిగ పిండి : అర కప్పు, ఉప్పు : సరిపడ, కారం : సరిపడ, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె : తగినంత, వంట సోడా : చిటికెడు. తయారీ విధానం : మైదా పిండి, బియ్యం పిండి, శెనగ పిండిని ఒక కప్పులో పోసి ఈ పిండికి ఉప్పు, కారం, వంటసోడా, జీలకర్ర వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మూకుడులో నూనె వేసి కాగిన తర్వాత గులాబి చేసే కర్రని నూనెలో పెట్టి దానిని కూడా వేడి చేయాలి. ఆ తర్వాత దానిని పిండిలో పెట్టి మళ్ళీ వేడి నూనెలో పెట్టాలి. అప్పుడు అది కర్రతో విడిపోయి పువ్వులా వస్తుంది. వాటిని గోధుమ రంగు వచ్చే వరకూ వేయించినట్టయితే, గులాబీ రేకులు రెడి. వీటిని తియ్యగా ఉప్పగా మనకు ఇష్టమైన రుచుల్లో తయారు చేసుకోవచ్చు.