Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో చెమట...చెమటకాయలు...నివారణ!

Advertiesment
ఆరోగ్యం
వేసవి కాలంలో చెమట ఎక్కువగా ఉటుంది. శరీరంలోని చెమటగ్రంథుల్లో తయారయ్యే చెమట బయటకు రావాలంటే స్వేదనాళాలు తెరచుకుని ఉండాలి. ఒకవేళ ఈ నాళాలు మూసుకుపోయినట్లయితే చెమట చర్మం ఉపరితలం మీదకు రాలేక, లోపలే ఉండిపోతుంది. దీంతో చిరాకు, చర్మమంతా మంటగా ఉంటుంది.

ముఖ్యంగా చెమటకాయలు వీపు, మొండెం, తదితర ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంటాయి. వీటి బారినుండి బయటపడాలంటే, నీడపట్టున ఉండటం మంచిది. ఈ జాగ్రత్తలను పాటించిన ఆ తరువాతనే వైద్య సహాయం తీసుకోవాలి. చెమటకాయల సమస్య నుండి దూరమయ్యేందుకు హోమియో వైద్యం చక్కగా పనిచేస్తుందంటున్నారు హోమియో వైద్యులు.

హోమియో మందులలో ముఖ్యమైనది "ఏపిస్"... సున్నితమైన చర్మం కలవారి చర్మం తాకితేనే బాధ, మంట, కందిపోయినట్లు ఉండటం, దద్దుర్లు తదితర సమస్యలతో బాధపడేవారు ఈ మందును వాడవచ్చంటున్నారు వైద్యులు. ఇలాంటి చర్మం కలిగినవారు ఒంటిపైన చల్లటి నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంటుంది. చల్లటి గాలి కూడా వీరికి హాయినిస్తుంది.

అసలు ఎండ అంటేనే గిట్టని వ్యక్తులకు 'నేట్రంమోర్' పరమౌషధం అని వైద్యులు చెబుతున్నారు. ఎండలోకి వెళితేనే తలనొప్పి, చర్మంపై దద్దుర్లు లేకపోయినా దురద, మంట, చర్మం కందిపోయి దురద రావడం, నెత్తురు గడ్డలు కట్టడం లాంటి సమస్యలతో బాధపడేవారు ఈ మందును వాడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu