కొంతమంది పిల్లల్లో పక్క తడపడం సమస్య కనబడుతుంటుంది. సాధారణంగా ఏడాది నిండిన తర్వాత పిల్లల్లో ఈ సమస్య కనబడదు. అయితే కొంతమందిలో మాత్రం ఇది ఆగకుండా ఉంటుంది. అంతేకాదు ఈ సమస్య పెద్దవారిలో కూడా కనిపిస్తుంటుంది. దీనికి కారణం మూత్రాశయ కండరాలు బలహీన పడటం, నులి పురుగులు ప్రేవులలో ఉండటం, పుట్టుకతో ఉండే అవయవాల లోపం వల్ల కావచ్చు.
దీనిని మనం హోమియోపతి మందులతో నివారించవచ్చు
1. పడుకున్న వెంటనే, కొద్ది సేపటికే పక్క తడిపితే... కాస్తికమ్ 30 వాడితే ఫలితం ఉంటుంది. ఈ మందు వాడినా సమస్య తగ్గనట్లయితే సెపియా 30 అనే మందును వాడవలసి ఉంటుంది.
2. నక్స్ వోమిక 30... ఇది అజీర్తి, మలబద్దకం, నులిపురుగుల వల్ల సమస్య కలిగినపుడు వాడవచ్చు
3. కాస్తికమ్ 30... మూత్రమును ఆపుకొనలేక పోవుచున్నపుడు దీనిని ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.
4. ఇగ్నాసియా 30... మానసిక ఆందోళన వల్ల, దిగుల వల్ల సమస్య కనిపించినపుడు ఈ మందును వాడాలి
5. పాలస్తిల్లా 30... బొద్దుగా ఉండే మహిళల్లో, పిల్లల్లో, దాహం తక్కువగా ఉండే సమస్య కనిపించినపుడు వాడవచ్చు
6. సినా 200 లేక 30... కడుపులో పురుగులు ఉండి పక్క తడుపుతున్నప్పుడు
7. అర్జంటమ్ నైట్రికమ్ 30... స్వీట్లు ఎక్కువగా ఇస్తే పడటం, పగటిపూట కూడా తెలియకుండా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ఈ మందును వాడాలి
8. ఈక్విస్టమ్ ద్రావణం... ఏ విధమైన కారణం లేకుండా పక్క తడుపుతున్నప్పుడు దీనిని వాడాలి
9. సోరినమ్ 200... చర్మ వ్యాధులతోపాటు పై సమస్య ఉంటే వాడవచ్చు
10. ఫెర్రమ్‌ఫాస్ 6x కూడా రక్తహీనత కలిగి సమస్య కనిపించినపుడు ఉపయోగించదగ్గ మందు.
సమస్య ఉన్నవారు టీ కాఫీలు తగ్గించడం, పడుకునే ముందు నీరు త్రాగకపోవడం వల్ల కొంతవరకూ సమస్య నుంచి బయటపడవచ్చు.
- డాక్టర్ మాధురీ కృష్ణ