జలుబుకు ఆయుర్వేద చిట్కాలు
, శుక్రవారం, 20 జులై 2012 (13:08 IST)
చాలామందిని తరచుగా వేధించే అనారోగ్య సమస్య జలుబు. అలా వాన చినుకుల్లో తడిస్తే చాలు పట్టుకుంటుంది పడిశము. దీనిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం.* వేడి నీటిలో పసుపు వేసి ఆ నీరును ఆవిరి పట్టించిన చెమటపట్టి పడిశం నశిస్తుంది.* నిప్పులలో పసుపుకొమ్ము వేసి ఆ పొగను పీల్చుతున్నట్లయితే జలుబు తగ్గుతుంది.* తేనెతో మిరియాల పొడి కలిపి తిన్నట్లయితే పడిశము తగ్గుతుంది* పొగడపువ్వులను ఎండబెట్టి పొడిచేసి నశ్యములా పీల్చినట్లయితే జలుబు తగ్గుముఖం పడుతుంది.