Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘అంజీర’ పండులో ఏమున్నాయో తెలుసా...?

మందులతో పని లేకుండా ప్రకృతి సిద్ధమైన ఫల సంపదే ఎన్నో రుగ్మతల నుంచి విముక్తి కలిగించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అంజీర పండు ఎన్నో రకాల అనారోగ్యాలకు చక్కని నివారణా రూపంగా స్పష్టమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండటం వల్ల వ్య

Advertiesment
‘అంజీర’ పండులో ఏమున్నాయో తెలుసా...?
, బుధవారం, 14 డిశెంబరు 2016 (19:25 IST)
మందులతో పని లేకుండా ప్రకృతి సిద్ధమైన ఫల సంపదే ఎన్నో రుగ్మతల నుంచి విముక్తి కలిగించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అంజీర పండు ఎన్నో రకాల అనారోగ్యాలకు చక్కని నివారణా రూపంగా స్పష్టమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో అంజీర పాత్ర అంత్యంత కీలకంగా మారింది. అంజీరలో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఇన్సులిన్‌ విడుదలను ఇది నిలకడగా ఉంచుతుంది. ఫెనోలిక్‌ యాంటీ ఆక్సిడెంట్లు అంజీరలో కావలసినంతగా ఉండడం వల్ల గుండె జబ్బులను ముందుగానే శక్తివంతంగా ఎదుర్కొంటుంది. అంజీర చర్మ ఆర్మోగ్య పరిరక్షణలో బాగా తోడ్పడుతుంది. చర్మంపై వాపును, ఎర్రదనాన్ని తగ్గిస్తుంది.
 
అంజీరలో క్యాటరాక్ట్‌ సమస్యను, దృష్టి లోపాలను తగ్గించే గుణాలు ఉన్నాయి. క్యాల్షియం, మెగ్నీషియం అంజీరలో సమృద్ధిగా ఉండడం వల్ల ఇవి ఎముకల దారుఢ్యానికి బాగా ఉపయోగపడతాయి.పేగుల కదలికలకు తోడ్పడే పీచుపదార్థాలు అంజీరలో ఎక్కువగా ఉండడం వల్ల ఇది అజీర్తిని నివారిస్తుంది. పీచుపదార్థాల వల్ల అతిగా ఆకలి ఉండదు కాబట్టి శరీరం బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అంజీరలో ఫ్లేవోనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ.వీటివలన సహజంగానే రొమ్ము, పెద్దపేగు, ప్రొస్టేట్‌ కేన్సర్లు నివారించబడతాయి. పొటాషియం నిలువలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల తరుచూ అంజీర పండ్లు తినేవారికి అధిక రక్తపోటు సమస్యలు తలెత్తవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం ఏర్పాటు(ఫోటోలు)