Publish Date: Sat, 24 Oct 2015 (20:15 IST)
Updated Date: Sat, 24 Oct 2015 (20:27 IST)
చాలామందికి వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఇలాంటి వాటిలో గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. దీని నివారణకు వివిధ రకాల మందులను తీసుకుంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లకు మందులతో చికిత్స తీసుకునే దానికంటే వంటింట్లో అందుబాటులో ఉండే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే నయమైనట్టే.
గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగినట్టయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే, జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి విముక్తి లభిస్తుంది.
అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ సమస్య విముక్తి పొందొచ్చు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More