Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్యాస్‌ ట్రబుల్‌కు నువ్వులు ఎంతో ఉపయోగం... గృహ వైద్యానికి అత్యుత్తమం

ఎంతోమంది గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడుతుంటారు. కూల్‌డ్రింక్‌ తాగితే వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలాసేపటి వరకు ఏదో ఒక విధంగా గ్యాస్‌ ట్రబుల్‌ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ గ్యాస్‌ ట్రబుల్‌ తగ్గడానికి ఒక

Advertiesment
sesame
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:33 IST)
ఎంతోమంది గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడుతుంటారు. కూల్‌డ్రింక్‌ తాగితే వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలాసేపటి వరకు ఏదో ఒక విధంగా గ్యాస్‌ ట్రబుల్‌ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ గ్యాస్‌ ట్రబుల్‌ తగ్గడానికి ఒక వైద్యం ఉంది. అయితే నువ్వులు. ఒక అరకప్పు పాలలో రెండు స్పూన్ల నువ్వులనూనె కలిపి ప్రతిరోజు కొంతకాలం తాగినట్టయితే పొట్టలో కురుపులు, గ్యాస్‌కు సంబంధించి మలబద్దకం వంటివి తగ్గిపోతుంది. అలాగే గ్యాస్‌ ట్రబుల్‌ అనేదే ఉండదు. ఇకపోతే.. నువ్వులను నానబెట్టి రుబ్బి తయారుచేసిన అరకప్పు పాలలో కొద్దిగా బెల్లం కలిపి సేవిస్తుంటే జీర్ణశక్తి వృద్ధి కావటమే కాక కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులపై కూడా పనిచేస్తాయి.
 
రాత్రిపడుకునే ముందు ప్రతిరోజూ తెల్లనువ్వులు రెండు స్పూన్లు తింటే మధుమేహం లేని వారికి అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. నువ్వులకు తగినంత బెల్లం వేసి నూరి ఉదయం రెండు స్పూన్లు, సాయంత్రం రెండు స్పూన్లు, 2-3 రోజులు తినిపిస్తే స్త్రీలకు గర్భస్రావం కలుగుతుంది. కాలిన గాయాలకు, బొబ్బలకు ప్రతిరోజూ నువ్వులనూనె రాసి ప్లాస్టిక్‌ కాగితం వేసి రాత్రిపూట కడుతుంటే గాయాలు చీము పట్టకుండా త్వరగా మానుతాయి.
 
నువ్వులకు ఆంగ్లంలో గింగిలీసీడ్సు అని పేరు. ఇవి ఎర్రనేలలో ఎక్కువగా పండుతాయి. నల్లనువ్వులను చెరువు మట్టి నేలలో సాగు చేస్తుంటారు. తెల్లనువ్వుల కన్నా ఎర్రనువ్వులు ఎక్కువ వైద్య గుణాన్ని కలిగి ఉంటాయి. నువ్వులు కటు, తిక్కత్త, మధుర (కారం-వగరు-తీపి) గుణాలు కలిగి ఉంటాయి. చర్మవ్యాధులను నశింప జేయడమేకాక స్త్రీలలో స్తన్యమును (పాలను) అధికం చేసే గుణం కలిగి ఉన్నాయి. ఇవి వాతరోగాలను నశింపజేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలబంద జ్యూస్ తీసుకుంటే.. లైంగిక పటుత్వం, రోగ నిరోధక శక్తి పెరుగుతుందట..