బానపొట్టకు జీలకర్రతో చెక్...
అనేక మంది బానపొట్ట, అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు వంటింట్లో లభించే జీలకర్రతో చెక్ పెట్టొచ్చు. గృహవైద్యంలోని కొన్ని చిట్కాలు, సూచనలు పాటించినట్టయితే బానపొట్టతో పాటు.. అధిక బరువు నుంచి కూడా వి
అనేక మంది బానపొట్ట, అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు వంటింట్లో లభించే జీలకర్రతో చెక్ పెట్టొచ్చు. గృహవైద్యంలోని కొన్ని చిట్కాలు, సూచనలు పాటించినట్టయితే బానపొట్టతో పాటు.. అధిక బరువు నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అదెలాగో చూద్ధాం.
రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే మరగించి పరగడుపున తాగాలి. అలాగే, రాత్రంతా నానబెట్టిన జీలకర్రను తినాలి. ఇలా నెల రోజులు చేస్తే బానపొట్ట కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.
అలాగే, ఒక గ్లాస్ నీటిని పాత్రలో తీసుకుని అందులో టీస్పూన్ జీలకర్రను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించి చల్లార్చాలి. అలా వచ్చిన నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగితే చాలు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అధికంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.