వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాము. వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది, రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది.
వెల్లుల్లిలో వున్న అడ్రినలైన్ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మార్చి రక్తపోటును నియంత్రిస్తుంది. మొటిమలు, నల్లమచ్చలు బాధిస్తున్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత జబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్ ప్రాపర్టీస్ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడం లాంటివి (బ్లడ్ క్లాట్స్) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తినడం మంచిది