Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కీర దోస‌తో బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గిపోతారు ఇలా...

ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే... క‌చ్చితంగా వారు కీర దోస‌తో ట‌చ్‌లో ఉండాలి. బరువు త్వరగా తగ్గాలన్నా కీరతో వీలవుతుంది. కీరదోసకాయ జ్యూస్‌ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవాలి. కీర దోసకాయ వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మరసంతో పోల్చితే కీర

కీర దోస‌తో బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గిపోతారు ఇలా...
, బుధవారం, 29 జూన్ 2016 (18:48 IST)
ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే... క‌చ్చితంగా వారు కీర దోస‌తో ట‌చ్‌లో ఉండాలి. బరువు త్వరగా తగ్గాలన్నా కీరతో వీలవుతుంది. కీరదోసకాయ జ్యూస్‌ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవాలి. కీర దోసకాయ వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మరసంతో పోల్చితే కీర దోసకాయ చాలా ఉత్తమమైనదని పరిశోధకుల నిర్థారించారు. బరువు తగ్గాలనుకునే వారు కీర దోసకాయ రసం తాగాలని కోరుకునేవారు, కీరదోసకాయ రసంలో తేనె చేర్చి తీసుకోవాలి. 
 
ఇంకా కీర దోసకాయ ఇష్టపడితే కీర దోసకాయ జ్యూస్‌ను నేరుగా తాగడంవల్ల మరింత ఎక్కువ పౌండ్ల బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గించడం కంటే ఆరోగ్యపరంగా కీర దోసకాయ ప్రయోజనాలు ఎక్కువ. క్లియర్‌ స్కిన్‌, జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. కాబట్టి మీరు హెల్దీగా, ఫిట్‌గా జీవించాలని కోరుకుంటున్నట్లయితే… కీర దోసకాయ వాటర్‌ తాగడంవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. 
 
ముందుగా కీర దోసకాయ పొట్టు తీసి, ముక్కలుగా కోసి మిక్సిలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఒక పెద్ద బౌల్‌లో కీర దోసకాయ గుజ్జువేసి అందులో అర గ్లాసు నీళ్లుపోసి బాగా మిక్స్‌ చేయాలి. కాగా రుచి కోసం చిటికెడు ఉప్పును మిక్స్‌చేయాలి. ఇంకా ఉప్పుకు బదులుగా తేనె మిక్స్‌ చేసి ఉదయం పరగడుపున తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుకుంది, కీరదోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. రోజంతా మీకు అవసరమయ్యే ఎనర్జీని ఈ జ్యూస్‌ అందిస్తుంది. కీరదోసకాయ శరీరాన్ని డిహైడ్రేషన్‌ చేస్తుంది. తగినంత నీరు తీసుకోలేనపుడు 90 శాతం నీరు ఉన్న ఒక చ‌ల్లటి కీరదోస కాయ తినండి. 
 
ఎక్కువ విటమిన్స్‌ అందిస్తుంది. శరీరానికి అవసరమయ్యే విటమిన్స్‌ను అందిస్తుంది. కీర దోసకాయ రోజువారీ కావాల్సిన విటమిన్లను తిరిగి నింపుతుంది. కుకుంబర్‌ రోజులో శరీరానికి కావాల్సిన చాలా విటమిన్లు ఉన్నాయి. మీ వ్యాధి నిరోధక వ్యవస్థను చురుకుగా ఉంచేందుకు, మీకు శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లు ఎ, బి, సి, డి పుష్కలంగా ఉన్నాయి. దోసకాయ రసంతో పాల కూర, క్యారట్‌ కలిపితే చాలా శక్తివంతంగా పని చేస్తుంది. కీరదోసకాయ జ్యూస్‌లో అత్యధికంగా మినరల్స్‌ ఉన్నాయి. ఈ మినరల్స్‌మీ శరీరం ఫిట్‌గా ఉండేందుకు సహాయపడతాయి. కీరదోస హైబిపిని కంట్రోల్‌ చేయగలదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీళ్లు ఎలా తాగాలి.. నిలబడి నీళ్లు తాగకూడదా? కచ్చితంగా కూర్చునే తాగాలా? ఎందుకు?