Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తక్కువ సమయంలో బరువు తగ్గాలంటే.. ఆ ఒక్కటీ చేస్తే చాలు

అనేక మంది శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ముఖ్యంగా శారీరక వ్యాయామాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు ఉండదు. నిజాన

Advertiesment
తక్కువ సమయంలో బరువు తగ్గాలంటే.. ఆ ఒక్కటీ చేస్తే చాలు
, మంగళవారం, 16 మే 2017 (10:31 IST)
అనేక మంది శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ముఖ్యంగా శారీరక వ్యాయామాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు ఉండదు. నిజానికి బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే చాలు. 
 
పరుగు వల్ల శరీరంలో ఉండే అధిక కెలోరీలు కరిగిపోతాయి. దాంతో కొవ్వు కరగడం మొదలవుతుంది. అలా చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
 
కండరాలు దృఢంగా మారడంతో పాటూ, కాళ్లూ, శరీరం కూడా తీరైన ఆకృతిలోకి వస్తుంది. పరుగు వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి కంటే తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
 
పరుగెత్తడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం. మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి.
 
చిన్నగా పరుగెత్తడంతో పోలిస్తే వేగంగా పరుగెత్తడం వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. పరుగు ప్రారంభించాలనుకునేవారు సరైన బూట్లను ధరించి పరుగెత్తడం మంచిది. అలాగే, దుస్తుల విషయంలోనూ సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహం నియంత్రణలో ఆ ఏడు తప్పులను అధిగమించడం ఎలా?