Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్థరాత్రి వేళ నిద్రించేటపుడు అకస్మాత్తుగా వచ్చే పొడి దగ్గు, వదిలించుకునేదెలా?

అర్థరాత్రి వేళ నిద్రించేటపుడు అకస్మాత్తుగా వచ్చే పొడి దగ్గు, వదిలించుకునేదెలా?
, శనివారం, 28 అక్టోబరు 2023 (15:53 IST)
వాతావరణ మార్పులు కారణంగా జలుబు, దగ్గు సమస్యలు వెంటనే ఒకరి నుంచి ఒకరికి ప్రబలుతాయి. కొందరిలో పొడి దగ్గు వేధిస్తుంటుంది. ఈ దగ్గు సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే పొడి దగ్గు తగ్గుతుంది. అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. 
 
అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. జీలకర్ర, కలకండను నమిలి తింటే దగ్గు నయం అవుతుంది.
4 మిరియాలు, 5 దాల్చిన చెక్కల్ని నెయ్యిలో వేపి పొడి చేసి ఓ తమలపాకులో పెట్టి తింటే దగ్గును దూరం చేసుకోవచ్చు. మిరియాలు, బెల్లాన్ని కాసింత పరగడపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
 
కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా కూడా దగ్గును తగ్గించుకోవచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషులు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన శక్తి