Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జలుబు, దగ్గు తగ్గేందుకు వేడివేడి సూప్... ఈ సూప్‌లు తాగితే...

Advertiesment
Hot soup to reduce cold and cough
, గురువారం, 20 జనవరి 2022 (19:15 IST)
కషాయాలు, కొన్ని రకాల కూరగాయలతో చేసిన సూప్‌లు ఆరోగ్యానికి మంచిదనడంలో సందేహం లేదు. అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేశాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు నుంచి బయటపడేందుకు కొన్ని సూప్‌లు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటే.. సీజనల్ వ్యాధులు త్వరగా నయమవుతాయి. 

 
సీజనల్ వెజిటబుల్స్, ముఖ్యంగా వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చితో చేసిన సూప్‌లను తాగడం వల్ల ఆరోగ్యం బలపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 5 రకాల కూరగాయలతో చేసిన సూప్‌లను తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు- దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మరి ఆ 5 రకాల సూప్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 
గుమ్మడికాయ సూప్- ఈ సూప్ తాగడం వల్ల ముక్కు దిబ్బడ, జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో ఈ సూప్ అద్భుతంగా ఉంటుంది. గుమ్మడికాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

 
టొమాటో బాసిల్ సూప్: అనారోగ్యంగా ఉన్నప్పుడు టొమాటో బాసిల్ సూప్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సూప్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ టొమాటో బాసిల్ సూప్ వెల్లుల్లి, టొమాటో, తులసి ఆకులతో తయారు చేస్తారు.

 
బ్రోకలీ - బీన్ సూప్: ఈ సూప్ తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయలు, బ్రోకలీ, బీన్స్ కలిపి కొద్దిగా పాలు, మొక్కజొన్న పిండి, మిరియాలు కలిపి సూప్ తయారు చేస్తారు. ఇది తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

 
పుట్టగొడుగుల సూప్: మష్రూమ్ సూప్ చాలా పోషకమైనది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యల నివారణలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
 
 
కూరగాయల సూప్: ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఇతర కూరగాయలతో కలిపి చేస్తారు. ఇందులో కారం కలిపితే సూపర్ టేస్టుతో పాటు అద్భుతమైన ఆరోగ్యం చేకూరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో కొద్దిగా మంచినీళ్లు తాగినా తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందా?