వెల్లుల్లి - తేనె మిశ్రమాన్ని పరగడుపున తీసుకుంటే?
వంటింట్లో అందుబాటులోవుంటే వస్తువుల్లో వెల్లుల్లి ఒకటి. ఇది ఓ దివ్యౌషధంగా కూడా పని చేస్తుంది. అలాంటి వెల్లుల్లిని పరగడుపున తేనెతో కలిసి తీసుకున్నట్టయితే అనేక ఫలితాలు ఉంటాయని గృహ వైద్య నిపుణులు సూచిస్తు
వంటింట్లో అందుబాటులోవుంటే వస్తువుల్లో వెల్లుల్లి ఒకటి. ఇది ఓ దివ్యౌషధంగా కూడా పని చేస్తుంది. అలాంటి వెల్లుల్లిని పరగడుపున తేనెతో కలిసి తీసుకున్నట్టయితే అనేక ఫలితాలు ఉంటాయని గృహ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకున్నట్టయితే రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ (బ్లాక్) కట్టకుండా చూస్తుంది. అలాగే రక్తనాళాల్లో పేరుకునిపోయివుండే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
జీర్ణాశయ, ఉదర సంబంధ సమస్యలను సులభంగా తొలగిస్తుంది. డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.
వెల్లుల్లి - తేనె మిశ్రమాన్ని దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటి వాటికి పూయడం వల్ల అవి వెంటనే తొలగిపోతాయి. శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. వీటిలో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా చర్మంపై ముడతలు తగ్గుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.