గ్యాస్.. ఎసిడిటీ.... ఒబేసిటీ... అన్ని బాధలూ ఉంటే ఏం చేయాలో తెలుసా?
అధిక బరువు ఉన్నారా? గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ సమస్య కూడా ఎదురవుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో... - రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి, మరిగించి, గోరువెచ్చగా తాగాలి. అదీ ఉదయం నిద్ర లేచిన
అధిక బరువు ఉన్నారా? గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ సమస్య కూడా ఎదురవుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో...
- రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి, మరిగించి, గోరువెచ్చగా తాగాలి. అదీ ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి.
- రాత్రి భోజనం చేశాక, పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి.
- ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ధి చెందుతుంది. అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.
- దీనితో పాటు సంతులిత ఆహరం తీసుకొంటూ, రోజులో కనీసం 4 కిలో మీటర్లు కాలినడక వ్యాయామం చేసుకోవాలి.
- పైల్స్ తగ్గడానికి చలవ వస్తువులు తినడంతో పాటు... రోజూ క్రమం తప్పుండా కుక్కుటాసనం వేస్తే పైల్స్ సమస్య తగ్గిపోతుంది.