Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతిమూత్ర వ్యాధి తగ్గాలంటే ఏం తినాలి?

చాలామంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ మందులు వాడుతుంటారు. మొదట్లో మందులు తగ్గినట్లు కనిపించినా ఆ తరువాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. అతి మూత్ర వ్యాధి తగ్గాలంటే నేరేడు గింజల చూర్ణము 40రోజులు తినాలి. అలాగే అత్తి చెక్క కషాయం

Advertiesment
అతిమూత్ర వ్యాధి తగ్గాలంటే ఏం తినాలి?
, బుధవారం, 26 అక్టోబరు 2016 (13:55 IST)
చాలామంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ మందులు వాడుతుంటారు. మొదట్లో మందులు తగ్గినట్లు కనిపించినా ఆ తరువాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. అతి మూత్ర వ్యాధి తగ్గాలంటే నేరేడు గింజల చూర్ణము 40రోజులు తినాలి. అలాగే అత్తి చెక్క కషాయం తాగుతూ ఉండాలి. అలాగే వెల్లుల్లి పూట పూటకు ఎక్కువ చేస్తూ 10రోజులు సేవించిన ఈ వ్యాధి తగ్గుతుందట.
 
మర్రిచెక్క కషాయంను కూడా తాగాలి. పటిక బెల్లం 3తులములు, మిరియాలు 3తులములు, శొంఠి 4తులములు గ్రహించి చూర్ణం చేసి, ఈ చూర్ణమును పూటకు ఒకటి భై నాలుగవ వంతు చొప్పున, ఒకటి బై రెండవ వంతున తులం నేతిలో కలుపుకుని రోజూ రెండు పూటలా తింటే అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది.
 
అలాగే ఉప్పిడి బియ్యం తవుడును, తాటి బెల్లముతో కలిపి మూడురోజులు తాగాలి. అత్తిపత్తి ఆకు, బెల్లం, సమపాళ్లలో కలిపి నూరి చిన్న ఉసిరి కాయంత తీసుకోవాలి. కసివింద చెట్టు ఎండు గింజలను పొడిచేసి తగుమాత్రం తేనెతో మూడు రోజులు భుజించాలి.
 
కసివిందాకు 50గ్రాముల కసివిందగింజల చూర్ణం 50గ్రాముల ఉసిరిక పరుగు చూర్ణం 25గ్రాములను చూర్ణం చేసి పూటకు 2గ్రాముల చొప్పున మంచి నీటితో 5రోజులు, రెండుపూటలా సేవించాలి. ముదిరిన తుమ్మచెట్టు పట్టను, చితక్కొట్టి నీటిలో కషాయముగా కాచి పూటకు ఒకటి నుంచి 2 స్పూనులు చొప్పున రెండుపూటలా తాగాలి. ఈ మందు మూత్రంలో చక్కెరను కూడా తగ్గించును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా మెహందీలతో శరీరానికి ముప్పు.. డెర్మటాలజిస్టుల వార్నింగ్