Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జామ ఆకుల 'టీ'ని త్రాగండి... అధిక బరువుని తగ్గించుకోండి...!!

అధిక బరువుతో బాధ పడుతున్నారా? ఉదయం పూట వ్యాయామాలు ఏమి చేస్తాంలే అని చిరాకు పడుతున్నారా? డైటింగ్ చేద్దామనే ఆలోచనలో పడ్డారా? తిండితిప్పలు మానేసి రోగిష్టి బ్రతుకు బ్రతికే కంటే, కేలరీలు, విటమిన్లు మీ చేతు

Advertiesment
Health Benefits of Guava Leaf Tea
, మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (15:31 IST)
అధిక బరువుతో బాధ పడుతున్నారా? ఉదయం పూట వ్యాయామాలు ఏమి చేస్తాంలే అని చిరాకు పడుతున్నారా? డైటింగ్ చేద్దామనే ఆలోచనలో పడ్డారా? తిండితిప్పలు మానేసి రోగిష్టి బ్రతుకు బ్రతికే కంటే, కేలరీలు, విటమిన్లు మీ చేతులారా వదిలేసుకోకండి. అయితే, సులువైన పద్ధతులను పాటించి మంచి బలంగా, ఆరోగ్యంగా, నిత్య యవ్వనంగా, నవ్వుతూ జీవితాన్ని సాఫీగా కొనసాగించండి. అయితే చిన్న చిట్కా వైద్యం మీ పెరటిలోనే ఉంది. అదేమిటంటే జామ చెట్టు. ఒకవేళ మీ పెరటిలోనే జామ చెట్టు ఉంటే ఇక ఎలాగోలో బరువు తగ్గడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ని దూరంగా తరిమి కొట్టవచ్చు.
 
* గుప్పెడు జామాకులని తీసుకొని, వాటిని కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారు అవుతుంది. ఈ టీని సేవించడం ద్వారా బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి.
* ఈ టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
* శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే అత్యున్నత శక్తి ఉంది. దీని ఫలితంగా చాలా సులువుగా బరువు తగ్గుతారు.
* జామాకుల టీని త్రాగితే శ్వాస సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.
* జామాకులను శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి. నోటి పూత కూడా తగ్గుతుంది.
* ఇందులో ఉండే యాంటి యాక్సిడెంట్లు నొప్పులు, వాపులు నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu