అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. మీ ఉదయాన్ని మీరు అల్లంతో ప్రారంభించాలి, ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి.
కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
పసుపు, అల్లం కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.