Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీర్యాభివృద్ధిని పెంచి బరువును తగ్గించే రాగి అంబలి.. ఇంకా ఎన్నో లాభాలు

ధాన్యపు గింజల్లో రాగులు కూడా ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కారణం వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉండటమే. రాగలి సంగటి ఆరగించడం లేదా రాగి అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Advertiesment
natcheny
, బుధవారం, 10 ఆగస్టు 2016 (09:18 IST)
ధాన్యపు గింజల్లో రాగులు కూడా ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కారణం వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉండటమే. రాగలి సంగటి ఆరగించడం లేదా రాగి అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రాగితో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా. రాగులతో తయారు చేసే అంబలి వల్ల కలిగే మేలు పరిశీలిద్ధాం. 
 
ధాన్య‌పు గింజ‌లైన రాగుల్లో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. అవి మ‌న శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా బ‌రువు త‌గ్గుతారు. ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. ఈ క్ర‌మంలో రాగి అంబ‌లిని ఎలా తయారు చేయాలో, దాంతో మ‌న‌కు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. రాగి అంబ‌లికి చ‌లువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.
 
ఒక గ్లాస్ రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయ‌దు. దీంతో క‌డుపు నిండిన భావ‌న కలుగుతుంది. ఆహారం ఎక్కువ‌గా తినాల‌నిపించ‌దు. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. స్థూల‌కాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.
 
ప్ర‌తి రోజూ ఉద‌యం చేసే సాధార‌ణ అల్పాహారానికి బ‌దులుగా రాగి అంబ‌లి తాగితే దాంతో మ‌నం రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. శారీర‌క దృఢ‌త్వం చేకూరుతుంది. బీపీ, షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. ర‌క్త‌స్రావం జ‌రుగుతున్న వారికి రాగి అంబ‌లి తాగిస్తే స్రావం ఆగిపోతుంది.
 
రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. చ‌దువుల్లో బాగా ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తారు. మెద‌డు చురుగ్గా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనె.. అసలుదా.. నకిలీదా.. తెలుసుకునేదెలా? (వీడియో)