తమలపాకులు - పచ్చకర్పూరం నమిలి రసాన్ని మింగితే...
సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కళ్లు బైర్లుకమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ఉండటం, చెమటలు పోయడం వంటివి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివాటికి చిన్నపాటి వంటింటి చిట్కాతో చెక్ పెట్టొచ్చు.
సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కళ్లు బైర్లుకమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ఉండటం, చెమటలు పోయడం వంటివి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివాటికి చిన్నపాటి వంటింటి చిట్కాతో చెక్ పెట్టొచ్చు.
రెండుపలుకుల పచ్చ కర్పూరం తీసుకుని, కొంచెం మంచి గంధాన్ని గానీ, వెన్నను గానీ, కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే పై సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేనా, శరీరంలోని వేడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది.
వేసవిలో పచ్చకర్పూరం తీసుకుంటూ ఉంటే వడదెబ్బ, అతిదాహం, శరీరం చిటపటలాడటం, శోష వంటివి తగ్గుతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు తరుచూ పచ్చకర్పూరం తీసుకుంటూ ఉంటే, కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలోంచి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.