Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాదంతో గుండె జబ్బుల చెక్!

బాదంతో గుండె జబ్బుల చెక్!
, శుక్రవారం, 7 నవంబరు 2014 (18:25 IST)
బాదం పప్పుతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో విటమిన్ ‘ఇ’, కాపర్, మెగ్నీషియంలతో పాటు ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని బయో యాక్టివ్ మాలిక్యూల్స్ గుండె సంబంధ వ్యాధులను నివారిస్తాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే, బాదం గింజలలోని సూక్ష్మ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నరాల వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. దంతాలు, ఎముకలను గట్టిపరుస్తాయి. కాబట్టి వార్ధక్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించవచ్చు. చర్మం కాంతివంతమవుతుంది. అందువల్ల పిల్లలకు రోజూ రెండు లేదా మూడు బాదం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
అయితే, బాదం తింటే దేహంలో కొవ్వు స్థాయులు పెరుగుతాయనే అపోహ చాలా బలంగా ఉంది. కానీ నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. ఇందులోని ఫ్యాటీ యాసిడ్‌ల వల్ల దేహ నిర్మాణానికి, జీవక్రియలకు అవసరమైన కొవ్వు సమృద్ధిగా లభిస్తుంది. ఇవి దేహంలోని కొలెస్ట్రాల్ స్థాయులను సమన్వయం చేస్తాయని చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu