Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'శృంగారానికి కొత్త వయాగ్రా' : పుచ్చకాయ, అరటిపండ్లు ఆరగిస్తే కోర్కెలు గుర్రాలై పరుగెడుతాయి!

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో కామ కోర్కెలు తగ్గిపోవడం సహజం. ఫలితంగా.. పడక గదిలో తమ భార్యలను సంతృప్తి పరచలేక లోలోన మథనపడిపోవడమే కాకుండా, భార్యల వద్ద చులకనైపోతారు.

Advertiesment
watermelon
, శుక్రవారం, 1 జులై 2016 (16:14 IST)
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో కామ కోర్కెలు తగ్గిపోవడం సహజం. ఫలితంగా.. పడక గదిలో తమ భార్యలను సంతృప్తి పరచలేక లోలోన మథనపడిపోవడమే కాకుండా, భార్యల వద్ద చులకనైపోతారు. ఇలాంటి మగవారు.. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏవోవే మందులు, నాటు వైద్యం చేయించుకుంటారు. ఇలాంటి వారు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పండ్లను ఆరగిస్తే చాలు... పడక గదిలో వేయి ఏనుగుల బలంతో రెచ్చిపోవచ్చట. అవేంటో పరిశీలిద్ధాం. 
 
పుచ్చకాయ... ఇది కేవలం వేసవికాలంలోనే ఉంటుంది. వేడి నుంచి ఉపశమనం కోసమే పుచ్చకాయను అధికంగా విరివిగా ఆరగిస్తారు. కానీ, ఇందులో ఓ రహస్యం దాగివుంది. కామలోకంలో మునిగిపోవాలంటే పుచ్చకాయను ఆరగిస్తే చాలట. ఇది మంచి దివ్యౌషధంగా పని చేస్తుందట. ఇది మగాడికి కావాల్సినంత కామాన్ని నింపుతుందట. ఇది కూడా మునక్కాయలాగానే ప్రకృతి వయగ్రాలా పని చేస్తుంది. 
 
అరటి పండ్లు... ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు అరటి పండు. అరటి పండ్లు ఆరగించడం వల్ల పురుషుల్లో వీర్య కణాల వృద్ధి పెరుగుతుందట. ఇందులో బీ1, సీ విటమిన్లు, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బ్రోమిలైన్ శక్తివంతమైన హార్మోన్‌గా పని చేస్తుందట. 
 
టమోటా... ప్రతి రోజూ ప్రతి ఇంట్లో తయారు చేసే కూరల్లో తప్పనిసరిగా వాడేది టమోటా. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. అందుకే కూరల్లో వేసిన టమోటాను అన్నం తినేటపుడు పక్కన పెడతారు. కానీ, శృంగార కోర్కెలు అధికంగా పెరగాలంటే కూరల్లో విధిగా టమోటాను వేసుకుని ఆరగించాలి. ఎందుకంటే ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, లేకోపాన్ వంటి పదార్థాలు పురుషుల్లో వీర్య కణాలను వృద్ధి చేయడమేకాకుండా, మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మజ్జిగతో చర్మానికి ఎంతో మేలు.. ఒళ్లంతా రాసుకుని స్నానం చేస్తే?