నిద్రించడానికి ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే...
వంటల్లో విధిగా వాడే వస్తువుల్లో పసుపు ఒకటి. ఇది చక్కని రంగు, రుచి, వాసన వస్తాయి. ఇక పాలు. పాలతో మనకు సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. చాలా మంది రోజూ పాలను తాగుతారు. అయితే నిత్యం రాత్రి నిద్రించ
వంటల్లో విధిగా వాడే వస్తువుల్లో పసుపు ఒకటి. ఇది చక్కని రంగు, రుచి, వాసన వస్తాయి. ఇక పాలు. పాలతో మనకు సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. చాలా మంది రోజూ పాలను తాగుతారు. అయితే నిత్యం రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?
నిజానికి నిద్రలేమి సమస్యకు పాలు - పసుపు ఓ మంచి ఔషధం. నిత్యం రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే నిద్రలేని సమస్యకు దూరంగా ఉండొచ్చు.
అలాగే, శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఈ మిశ్రమంలో ఉండటం వల్ల రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు రావు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి చాలా మంచి చేస్తుంది.