అంజీర లేదా అత్తి పండు. ఈ అత్తి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని తినకుండా వుండరు. అత్తి పండ్లను ఎండబెట్టి వాటిని నీటిలో నానబెట్టి తింటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండు తింటుంటే రక్తపోటు, వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది. అత్తి పండ్లు బరువు నిర్వహణలో సహాయపడుతాయి.
గుండెకి మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారం అంజీర. అంజీర క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అంజీర రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. అంజీర ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంజీర పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య వున్నవారు అత్తి పండ్లను తింటే సమస్య తగ్గుతుంది. అంజీర పండు తింటే మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది