Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిచ్చి బఠాణినా అని కొట్టిపారేయకండి. అంతటి మదుమేహమే ఫట్ అట!

మనం సాదారణంగా పెద్దగా పట్టించుకోని పిచ్చి బఠానిలో ఎన్నో రోగాలకు విరుగుడు దాగి ఉన్నదనీ తెలుస్తోంది. ముఖ్యంగా, మదువేుహం తదితర వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలను ఈ రెండు చెట్ల ఆకుల నుంచి తయారు చేయవచ్చునని ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోకెమిస్ట్రీ పరిశోధక

Advertiesment
plants
హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (07:51 IST)
పెరటివైద్యానికి పనికివచ్చే వేరు మూలికలు, మొక్కలు, ఆకుపసర్లూ ఆధునిక వైద్యంలోనూ అద్బుతాలు సృష్టిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మనం సాదారణంగా పెద్దగా పట్టించుకోని పిచ్చి  బఠానిలో ఎన్నో రోగాలకు విరుగుడు దాగి ఉన్నదనీ తెలుస్తోంది. ముఖ్యంగా, మదువేుహం తదితర వ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలను ఈ రెండు చెట్ల ఆకుల నుంచి తయారు చేయవచ్చునని ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోకెమిస్ట్రీ పరిశోధక విద్యార్థిని స్రవంతి మద్దిల నిరూపించారు. అంకుడు చెట్టుపై అందవెున బొమ్మలు చెక్కుతారు. కలప హస్త కళాకారుల చేతుల్లో అనేక ఆకృతులు తీసుకొనే ఈ వృక్షానికి..ఆరోగ్యాన్ని తీర్చిదిద్దే గుణముూ ఉన్నదని తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
అంకుడు చెట్టు, పిచ్చిబఠానీ తీగ ఆకులను స్రవంతి సేకరించారు. వాటినుంచి కాపర్‌, ఐరన్‌ నానో పదార్థాలను తయారుచేశారు. నిజానికి, వీటి తయారీ చాలా సులువు, ఖర్చూ తక్కువ. పైగా పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. ఈ నానో పదార్థాలు బాక్టీరియా వినాశనానికి తోడ్పడతాయని పరిశోధనాత్మకంగా స్రవంతి రుజువు చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న యాంటీబయాటిక్స్‌కు బదులు వీటిని ఉపయోగించి.. వైద్యం ఖర్చుని తగ్గించుకోవచ్చునని ఆమె అంటున్నారు. 
 
మరింత ముందుకెళ్లి.. స్రవంతి అంకుడు చెట్టు ఆకుల నుంచి ఫినాల్‌ కాంపౌండ్‌ను వేరుచేసి శుద్ధి చేశారు. ఆ కాంపౌండ్‌కు మధుమేహాన్ని తగ్గించే గుణం ఉంది. ఈవిషయాన్ని నిరూపించడం కోసం స్రవంతి.. ఎలుకల మీద ప్రయోగం చేశారు. తన ప్రయత్నంలో విజయం సాధించారు. ఫినాల్‌ కాంపౌండ్‌ గ్లూకోస్‌.. కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని స్రవంతి విశ్లేషించారు. 
 
యాంటీగొనన్‌ లెప్టోపస్‌ అనే శాస్త్రీయ నామం గల పిచ్చి బఠానీ తీగ ఆకులలో డయాబెటిస్‌, ఆస్తమా, లివర్‌, స్ప్లీన్‌ డిజార్డర్స్‌, గొంతు నొప్పిని తగ్గించే గుణం ఉంది. హైపర్‌ టెన్షన్‌, ఇతర నొప్పుల నివారణకు గొప్ప దోహదకారి. 
 
ఈ ప్రయోగ ఫలితాలను ఆమె ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో ప్రచురించారు. మరింత లోతుగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపితే.. కేన్సర్‌, కార్డియో వాస్క్యులర్‌ వంటి ప్రమాదకర వ్యాధుల చికిత్సకు ఔషధాలను అభివృద్ధి చేయొచ్చునని స్రవంతి చెబుతున్నారు. ఆంధ్రా వర్సిటీలో బయోకెమిస్ట్రీ ఆచార్యులు కెపీజే హేమలత మార్గదర్శకత్వంలో ఆమె జరిపిన ఈ కృషి...డాక్టరేట్‌ని అందించింది.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైగ్రేన్ @ వితవుట్ ఆపరేషన్: దుష్ప్రభావాలు మటుమాయం