Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్లె పూవు మంచి మందు

Advertiesment
మల్లె పూవు
మల్లె పూవులో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది ఉద్రిక్తను ఉపశమింపజేసి, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. దీనిలోని సుతిమెత్తని పరిమళాల వల్ల మెదడు ఉద్దీపనం అవుతుంది. సామరస్యం, ఆశావాదం, సంతోషం వంటి భావాలను పెంపొందించడంలో మల్లె ఎంతగానో సహాయపడుతుంది.

మల్లెపూవులో యాంటి సెప్టిగ్ గుణాలు ఉన్నందువల్ల అనేక చర్మ సంబంధిత సమస్యల పరిష్కారానికి దీనిని ఉపయోగిస్తారు. అరోమా థెరపీ జాస్మిన్ శ్యాండిల్స్ ఉపశమానాన్ని కలిగిస్తాయి. అంతేకాదు మల్లెపూవు వీర్యవృద్ధిని కలిగించడంలోనూ ఎంతో సహాయపడుతుంది.

పొడి చర్మం, పగిలిన పాదాలు, చర్మం దురదలను తగ్గించడానికి మల్లెను ఉపయోగించవచ్చు. కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. ఔషధపరంగా చూస్తే దీనిని ప్రధానంగా ఎసెన్షియల్ ఆయిల్ తయారీకి మరియూ టీగా తీసుకోవడానికి ఉపయోగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu