Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధుమేహంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా...?

Advertiesment
మధుమేహంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా...?
, బుధవారం, 18 జనవరి 2012 (20:01 IST)
మధుమేహం రెండు రకాలు. మొదటిది ఇన్సులిన్‌ ఆధారిత మధుమేహం, రెండోది ఇన్సులిన్‌ నిరాధారిత మధుమేహం. ఇన్సులిన్‌ ఆధారిత మధుమేహం చిన్న పిల్లల్లోనూ, యవ్వనస్థుల్లోనూ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు సన్నగా, బలహీనంగా కనిపిస్తారు. రక్తంలోని కొన్ని నిరోధక పదార్థాలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల లేదా ఇతర వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల పాంక్రియాస్‌ గ్రంథి దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మనదేశంలో షుగరు వ్యాధిగ్రస్థుల్లో రెండు శాతం మాత్రమే ఈ రకానికి చెందినవారు.

ఈ రకానికి చెందిన షుగరు వ్యాధిలో పాంక్రియాస్‌ గ్రంథి ఏ మాత్రము ఇన్సులిన్‌‌ను తయారు చేయదు. కాబట్టి వీరు తప్పకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ మాత్రమే తీసుకోవాలి. టాబ్లెట్లు పనిచేయవు. దేశంలోని షుగరు వ్యాధి వ్యాధిగ్రస్థుల్లో 98 శాతం ఇన్సులిన్‌ నిరాధారిత మధుమేహం రకానికి చెందినవారు. 30 ఏళ్లు పైబడిన వారిలో ముఖ్యంగా స్థూలకాయం, బొజ్జ, వ్యాయామం లేకపోవటం, ఎక్కువగా మానసిక ఒత్తిడులకు లోనుకావడంతోపాటు వంశపారంపర్యం వల్ల కూడా వస్తుంది. ఈ రకం షుగరు వ్యాధిలో ఇన్సులిన్‌ శరీరంలో తయారవుతూనే వుంటుంది. కానీ తగినంత కాదు, ఇన్సులిన్‌ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ రకం మధుమేహం వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు ఆహార నియమాలు, వ్యాయామం, టాబ్లెట్ల వాడకంతో అదుపు చేయవచ్చు.

డయాబెటీస్ రోగుల సంఖ్య గత 50 సంవత్సరాలలో అధిక బరువు సమస్యతో, 2010 సంవత్సరం నాటికి సుమారుగా 285 మిలియన్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ షుగర్ వ్యాధి ఎక్కువ కాలం వుంటే గుండెపోటు, కిడ్నీ విఫలమై డయాలసిస్ చేయాల్సి రావటం, అవయవాలలో రక్తప్రసరణ సరిగా లేక వాటిని తీసివేసే పరిస్థితి రావటం వంటివి జరుగుతాయి.

షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారం
1 . రాగి మాల్ట్
మొలకెత్తిన రాగులలో 'సి - విటమిన్ ' ఎక్కువగా వుంటుంది. కాల్షియం ఎక్కువగా వుంటుంది. పీచు పదార్థం కూడా వుంటుంది. ఇది అన్ని వయసులవారికి చాలా మంచిది, ముఖ్యంగా షుగర్‌ను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది.

కావలసినన్ని రాగులు తీసుకుని రాళ్లు లేకుండా శుభ్రం చేసి, రోట్లో దంచి చెరిగితే పై పొట్టు పోతుంది. తర్వాత వాటిని 12 గంటల వరకు నీళ్ళల్లో నానబెట్టి, కడిగి, శుభ్రమైన నూలుగుడ్డలో మూటగట్టి, అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. రెండు రోజులలో మొలకలు వస్తాయి. వాటిని నీడలో ఆరబెట్టి, ఆరిన తర్వాత నూనె లేకుండా వేయించి, మెత్తగా దంచుకోవాలి. ఈ పొడిని రోజూ మూడు పూటలా - పూటకు 1 - 2 స్పూన్‌ల పొడిని గ్లాసు పాలలోగాని, మజ్జిగలో గాని కలుపుకుని క్రమం తప్పకుండా తాగాలి. ఈ పొడిలో ఉప్పు కానీ , చక్కెరకాని కలుపకూడదు. ఈ పొడిలో యాలకులు లేదా లవంగాల పొడిని కలుపుకోవచ్చు. ఈ 'రాగిమాల్ట్ ' షుగర్ రోగులు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల నీరసం పోయి, షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. ఎక్కువ రక్తపోటు ( హై. బి .పి ) తగ్గుతుంది. గుండె మంట తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2. ఉల్లిపాయ
రోజూ మూడు పూటలా ఒక ఉల్లిపాయను బాగా నమిలి తినాలి. (లేదా ) ఉల్లిపాయను ముక్కలుగా కోసి వాటిని వెంటనే వెన్న తీసిన మజ్జిగలో వేసి, 1 - 1 /2 గంట ఊరనిచ్చి , తర్వాత ఆ ముక్కలను తీసి, ఆ మజ్జిగను నేరుగా లేదా అన్నంలో కలుపుకుని తినాలి.

3. ఉసిరికాయ పచ్చడి
ముదిరిన ఉసిరికాయల పచ్చడిని (బాగా నిల్వ చేసిందయియితే మంచిది ) రోజూ మధ్యాహ్నం అన్నంలో మొదటి రెండు ముద్దల వేడి అన్నంలో కలుపుకొని కొంత నెయ్యితో తినాలి.

4. వేడి వేడి మొక్కజొన్న గింజలు
ఇది బలమైన పోషకాహారం. లేత మొక్కజొన్న పొత్తులకు పైన వుండే ఆకులను తీసెయ్యకుండా, వాటిని పూర్తిగా కాల్చి, ఈ గింజలను తినడం వల్ల మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు ( హై.బి.పి ) తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. శరీరంలోని ఎముకల నిర్మాణానికి కూడా సహాయపడతాయి.

5. బొప్పాయి పండు
పండిన తియ్యని తాజా బొప్పాయి పండుని రోజూ భోజనం తర్వాత తినాలి. దీనివల్ల మధుమేహ వ్యాధి కంట్రోల్ అవుతుంది. మూత్ర వ్యాధుల మీద పనిచేస్తుంది. కంటి చూపును పెంచుతుంది. ఇది జీర్ణ శక్తికి అధ్బుతమైన ఫండు, కడుపులోని రోగక్రిములను నాశనం చేస్తుంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. మలబద్దకం కూడా తగ్గుతుంది.

6. పాలు
కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న పాలను నిత్యం తాగడం వల్ల కూడా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. పాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంది. కాబట్టి పాలు తాగితే సూర్యరశ్మి నుండి రక్షణకై వాడే లోషన్‌లను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు.

7. పొట్లకాయ
చాలామంది పొట్లకాయలు తినటానికి ఇష్టపడరు కానీ వీటిని తరచుగా తీసుకోవడం మంచిది, అయితే తీసుకునేప్పుడు తక్కువ తీసుకోవాలి, పొట్లకాయకు పెరుగు, కొబ్బరి కలిపి, పొట్లకాయ పెరుగు పచ్చడిగా కూడా తయారు చేస్తారు. లేదా పొట్లకాయను కూరగా వండుతారు. పొట్లకాయ తింటే మధుమేహ రోగులకు ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెపుతున్నారు. అయితే తమకు ఉన్నటువంటి డయాబెటిస్ ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకుని వీటిని పాటించాలి. వైద్యుల సలహా తప్పనిసరి.

Share this Story:

Follow Webdunia telugu