Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లైట్‌లో వైన్ తాగిన హాలీవుడ్ నటి.. చంపాలని చూస్తున్నాడంటూ కేకలు.. బిత్తరపోయిన ప్రయాణికులు

ఫ్లైట్‌లో వైన్ తాగిన హాలీవుడ్ నటి.. చంపాలని చూస్తున్నాడంటూ కేకలు.. బిత్తరపోయిన ప్రయాణికులు
, మంగళవారం, 21 జూన్ 2016 (15:40 IST)
హాలీవుడ్‌‍లో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన నటి సెమ్లా బ్లెయిర్. ఈమె వయసు 43 యేళ్లు. ‘క్రుయల్ ఇంటెన్షన్, ది యాంగర్ మేనేజ్ మెంట్’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 
 
అయితే ఆమె తాజాగా తన కుమారుడితో కలిసి మెక్సికో నుంచి లాస్ ఏంజెలెస్‌కు విమానమెక్కింది. విమానమెక్కిన తర్వాత ఆమె చాలా విచిత్రంగా ప్రవర్తించింది. వైన్‌లో ఏవో మందులు క‌లుపుకొని తాగింది. త‌ర్వాత త‌న‌ను ఒక‌తను కొడుతున్నార‌ని, త‌న‌ను తాగ‌నివ్వ‌ట్లేద‌ని, అంతేగాక త‌న‌ను చంపాల‌ని చూస్తున్నాడంటూ ఆమె బిగ్గరగా కేకలు పెట్టింది. ఆమె ప్రవర్తనతో సహచర ప్రయాణికులు బిత్తరపోయారు. 
 
ఇంతలో లాస్ ఏంజిల్స్ రానే వచ్చింది. అక్కడ ఆమెను విమాన సిబ్బంది జాగ్రత్తగా కిందికి దించి.. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె వైన్‌లో క‌లుపుకొని తాగిన మందుల ప్ర‌భావ‌మే ఆమె అరుపులు పెట్ట‌డానికి కార‌ణ‌మా..? అనే అంశాన్ని డాక్ట‌ర్లు ప‌రిశీలించారు. సెమ్లా బ్లెయిర్ ఏదైనా సైకలాజికల్ సమస్యతో బాధ పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైఫ్ అలీ ఖాన్ యంగ్ హీరోయిన్స్‌తో స్టెప్స్.. ప్రేమలో మునిగిన కుమార్తె సారా