Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైఫ్ అలీ ఖాన్ యంగ్ హీరోయిన్స్‌తో స్టెప్స్.. ప్రేమలో మునిగిన కుమార్తె సారా

సైఫ్ అలీ ఖాన్ యంగ్ హీరోయిన్స్‌తో స్టెప్స్.. ప్రేమలో మునిగిన కుమార్తె సారా
, మంగళవారం, 21 జూన్ 2016 (15:15 IST)
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. వెండితెరపై యంగ్ హీరోయిన్స్‌తో స్టెప్పులేస్తుంటాడు. ఈయనకు పెళ్లీడుకొచ్చిన కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు సారా ఆలీ ఖాన్. ఈమె కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే మనుమడు వీర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాకుండా, నిశ్చితార్థం కూడా జరిగినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
చాజాగా, సారాకు ఎంగేజ్‌మెంట్ అయినట్టు ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. సారా వేలికి ఉంగరం కనిపించడంతో వీర్ తో ఆమెకు ఎంగేజ్‌మెంట్ అయిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇంకో సంగతి ఏంటంటే... సారా అలీఖాన్ మూవీ ఎంట్రీ ఇవ్వవచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి సైఫ్ అలీఖాన్ ఏం చేస్తాడు? కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడా? లేక బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్నది తేలాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23 నుంచి చిరంజీవి 150వ సినిమా షూటింగ్.. హీరోయిన్ ఎవరో త్వరలోనే క్లారిటీ!