బాలీవుడ్ హీరోయిన్లు పారితోషికంలో ఎప్పుడూ ముందుంటారు. హీరోలతో పోటీపడుతూ హీరోయిన్లు కూడా తమ కెరీర్ మెరుగుపరుచుకుంటున్నారు. ఈ కోవలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా చేరిపోయింది. హాలీవుడ్ నుంచి స్వదేశానికి వచ్చిన ప్రియాంక చోప్రా.. 40 రోజులకు వంద కోట్లు సంపాదించనుందట. అయితే ఇంత మొత్తం సినిమాల్లో నటించడంతో వచ్చేది కాదని ఓన్లీ యాడ్స్ రూపంలో ఆమెకొచ్చేదని తేలింది.
అమెరికాలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్స్‌ను ప్రచారం చేయాల్సిందిగా ప్రియాంకా చోప్రాను విజ్ఞప్తి చేస్తున్నారట. గోల్డ్ జ్యూయలరీ హౌస్, ప్రీమియమ్ ఎయిర్‌లైన్, పాన్ మసాలా ఇలా చాలా కంపెనీలు జాబితాలో ఉన్నాయట. మరి వీటిలో ఏ కంపెనీని ఎంపిక చేసుకోవాలనే దానిపై ప్రియాంక చోప్రా మల్లగుల్లాలు పడుతోంది. ఒక వేళ వీటన్నిటికీ ప్రచారకర్తగా వ్యవహరిస్తే ప్రియాంక చోప్రా 40 రోజుల్లో 100 కోట్లు ఆదాయం సంపాదించే అవకాశం ఉందని సమాచారం.