Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం...12 రోజులు షూటింగ్.. రూ.8 కోట్లు ఖర్చు

బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం...12 రోజులు షూటింగ్.. రూ.8 కోట్లు ఖర్చు
, గురువారం, 26 మే 2016 (12:43 IST)
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. ఇది బాలయ్యకు వందో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకటో శతాబ్దపు శాతవాహన రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి  జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. 
 
అందులో భాగంగానే ఈ సినిమాలో చాలావరకు బాలీవుడ్ నటీనటుల్నే క్రిష్ ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్‌ని మొరాకో దేశంలో పూర్తి చేసుకొని ఇటీవలే యూనిట్ సభ్యులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇంతకీ ఈ చిత్రం బడ్జెట్ ఎంతో తెలిస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే. అక్షరాల రూ.60 కోట్లు. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన "లెజెండ్'' సినిమా రూ.40 కోట్లు వసూళ్లు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 
 
అయితే ఇప్పుడు ఈ చిత్రం వసూలు చేసిన బడ్జెట్ కంటే దాదాపు 20 కోట్ల రూపాయలు అదనంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి నిర్మాతలు ఖర్చుపెడుతున్నారు. కాగా మొరాకోలో షూటింగ్ చేసింది కేవలం 12 రోజులేనట. దీనికే రూ.8 కోట్లు ఖర్చు పెట్టేయడం విశేషం. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు.. వందల సంఖ్యలో గుర్రాలు.. ఒంటెలు.. ఇతర జంతువులు.. టాప్ లెవెల్ టెక్నీషియన్లు.. భారీగా యుద్ధ సామగ్రి.. లొకేషన్ అద్దెలు.. ప్రయాణ ఖర్చులు.. భోజన వసతి సదుపాయాలు.. వీటన్నింటికి ఆ మాత్రం ఖర్చు తక్కువేనని సినీ పండితులు అంటున్నారు. సినిమా పూర్తయ్యేసరికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్టే అయ్యేలా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనసూయ ఫేస్ బుక్ ఫోటోకు అంత క్రేజా..? వామ్మో 63వేల లైకులా?!