Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

Advertiesment
Predator with a hunter story

చిత్రాసేన్

, శనివారం, 25 అక్టోబరు 2025 (19:04 IST)
Predator with a hunter story
సైన్స్‌ ఫిక్షన్‌ చరిత్రలో అత్యంత భయానకమైన పాత్రలలో ఒకటైన ప్రెడేటర్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి, అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.
 
ఇప్పుడు అదే సిరీస్‌కి కొత్త రూపాన్ని ఇస్తూ, “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” నవంబర్‌ 7, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈసారి కథలో మలుపు ఏమిటంటే — వేటగాడే వేటలో చిక్కుకుపోతాడు.
 
 1987లో ప్రారంభమైన లెజెండ్‌..  అర్నాల్డ్‌ ష్వార్జెనెగర్‌ ప్రధాన పాత్రలో వచ్చిన తొలి “ప్రెడేటర్” చిత్రం, అమెజాన్‌ అడవుల్లో కమాండోలు ఎదుర్కొన్న కంటికి కనిపించని భయానక మృగం కథతో ప్రేక్షకులను కుదిపేసింది.
 
1990లో ప్రెడేటర్ 2 – కాంక్రీట్ జంగిల్.. ఈసారి లాస్‌ఏంజెల్స్‌ నగరాన్ని వేటస్థలంగా మార్చుకున్న యౌట్జా, గ్యాంగ్‌స్టర్లను, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నాడు. మానవ చరిత్రలో ఈ జీవుల ఉనికి ఎంతకాలంగా ఉందో ఈ చిత్రం సూచించింది.
 
2010లో ప్రెడేటర్స్ – గేమ్ ప్రిజర్వ్ అండ్ బియాండ్ ప్రెడేటర్స్.. ఈ భాగంలో మానవ యోధులను ప్రెడేటర్ల స్వగ్రహానికి తీసుకెళ్లి బంధిస్తారు. అక్కడ వారు సూపర్‌ ప్రెడేటర్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కథ యౌట్జా జాతి అంతర్గత విభేదాలను కూడా చూపించింది.
 
2022లో – ఎ రిటర్న్ టు రూట్స్ ప్రే..1719లో అమెరికాలోని కమాంచీ తెగకు చెందిన యువతి నారు కథతో తెరకెక్కిన “ప్రే”, ప్రెడేటర్‌ సిరీస్‌కు కొత్త ఊపును తెచ్చింది. కొత్త కాలం, కొత్త దృష్టికోణంతో వేటను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
 
 2025లో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్– వేటలో చిక్కుకున్న వేటగాడు.. ఇప్పుడు డాన్‌ ట్రాచ్‌టెన్‌బర్గ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” ఆ ఊపును మరింతగా పెంచబోతోంది. ఈసారి కథ యౌట్జా యువ ప్రెడేటర్‌ “డెక్” చుట్టూ తిరుగుతుంది.
డెక్‌ ఒక ప్రమాదకరమైన గ్రహంలో ఆండ్రాయిడ్‌ యోధురాలు “థియా”తో కలిసి జీవన యుద్ధం సాగించాల్సి వస్తుంది.
 
ఇది మొదటిసారిగా ప్రెడేటర్‌ దృష్టిలో చెప్పబడుతున్న కథ. యౌట్జా జాతి సంస్కృతి, విలువలు, నైతికత, బలహీనతల్ని లోతుగా చూపించబోతున్న ఈ చిత్రం, ఈ ఫ్రాంచైజ్‌కు ఒక కొత్త మలుపు ఇవ్వనుందనే ఆశలు ఉన్నాయి.
 
సిరీస్‌కు కొత్త ఊపునిచ్చే ప్రయోగం.. ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ కేవలం యాక్షన్‌ మరియు థ్రిల్‌ మాత్రమే కాకుండా, ఆ యౌట్జా జీవుల అంతర్ముఖ ప్రపంచాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
వేట అంటే ఏమిటి? వేటగాడి నైతిక సరిహద్దు ఎక్కడిదీ? అనే ప్రశ్నలతో సాగబోయే ఈ చిత్రం, ప్రెడేటర్‌ సిరీస్‌ అభిమానులందరికీ మిస్‌ కాకూడని అనుభవంగా నిలిచే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sharva: బైకర్ కోసం శర్వా జా-డ్రాపింగ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్