Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ అవమానం చాలు. ఇక హైదరాబాద్‌లో ఉండొద్దు.. చలో విశాఖ అంటున్న టాలివుడ్

డ్రగ్స్ రాకెట్ విషయంలో సిట్ విచారణ తీరుతో ఒక్కసారిగా షాక్ అయ్యారు బాబులు. మూడేళ్లుగా అటూ ఇటూగా ఉంటున్న ఆలోచనలు ఇప్పుడు బాగా పదునెక్కాయి. రారమ్మని పిలుస్తున్న ఏపీకి చిత్రపరిశ్రమ వెళ్లిపోతే ఎలాగుంటుందనే

ఈ అవమానం చాలు. ఇక హైదరాబాద్‌లో ఉండొద్దు.. చలో విశాఖ అంటున్న టాలివుడ్
హైదరాబాద్ , గురువారం, 27 జులై 2017 (09:15 IST)
లోకల్ లోకలేనని, నాన్ లోకల్ ఎప్పుడూ రెండో తరగతి పౌరులే అన్న విషయం టాలీవుడ్‌కి చాలా ఆలస్యంగా బోధపడినట్లుంది. చంటిగాడు లోకల్ అంటూ పూరీ జగన్నాథ్ ఎప్పుడో చెప్పాడు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా వచ్చేసింది. మనోడు అంటూ ఎవరూ లేకపోతే.. మన రాజకీయ పెత్తనం అంటూ ఏదీ లేకపోతే ఎలా ఉంటుందో బాగా తెలిసి వచ్చింది. 
 
డ్రగ్స్ రాకెట్ విషయంలో సిట్ విచారణ తీరుతో ఒక్కసారిగా షాక్ అయ్యారు బాబులు. మూడేళ్లుగా అటూ ఇటూగా ఉంటున్న ఆలోచనలు ఇప్పుడు బాగా పదునెక్కాయి. రారమ్మని పిలుస్తున్న ఏపీకి చిత్రపరిశ్రమ వెళ్లిపోతే ఎలాగుంటుందనేదని కొందరు నిర్వహించిన అర్ధరాత్రి మీటింగులో చేసిన ప్రస్తావన. విచారణ పేరుతో సిట్ గత పదిరోజులుగా సినిమా వాళ్లకే సినిమా చూపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సినీ పెద్దలు. సినిమావాళ్లు అంటే డ్రగ్స్, మందులు, అమ్మాయిలు, సవాలక్ష అవలక్షణాలు ఉన్నవారుగా చిత్రీకరించడంపై మథన పడుతున్నారు. 
మద్రాసు నుంచి హైదరాబాదుకు ఇండస్ట్రీ తరలి వచ్చిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఏదీ సంచలనం కాలేదు. నాలుగేళ్ల క్రితం జరిగిన డ్రగ్స్ రాకెట్ విషయం కూడా  48 గంటల్లో సద్దుమణిగింది .ఇప్పుడు పది రోజులుగా ఇదే  అంశంతో ప్రతి ఒక్కరి పేరూ బయటకు రావడాన్ని టాలీవుడ్‌లో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
అప్పట్లో ఏ సమస్య వచ్చినా రాజకీయంగా ఎవరో ఒకరు ఆదుకునేవారు. పెద్ద సమస్య ఎదురైతే టీడీపీ ప్రభుత్వం ఉంటే దగ్గుపాటి ప్యామిలీ,. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దాసరి నారాయణ రావు  వద్దకు వెశ్లేవారు. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా ప్రభుత్వం ఏదైనా సరే అన్ని పార్టీలతోనూ సంబంధం ఉండేది. చిన్నా చితకా వారు ఎవరైనా అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లానుంచి వచ్చినవారు కాబట్టి ఆయా ప్రాంతాల మంత్రులను పట్టుకని ఈజీగా బయటపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులూ లేవు. రాష్ట్రం విడిపోయింది. పరిచయాలు, చుట్టాలు, బరువులు, రాజకీయ పలుకుబళ్లు అంతా ఆంద్రప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ తెలంగాణలో నా అని తలెత్తుకుని చేసేవారే లేరు.  జరుగుతున్న వ్యవహారాలను ఏపీలోని మంత్రుల వద్దకు తీసుకెళ్లి చెబితే వారు తెలంగాణ మంత్రులు, అధికారులకు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే వారి ఆస్తులు, అంతస్తులు కూడా హైదరాబాద్‌కతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని చూద్దా, చేద్దా అనేసి వెళ్లిపోతున్నారట. 
 
పైగా ఏపీ మంత్రిని ఎవరిని పట్టుకుని పని ఉంది అని అడిగినా, చూడు బ్రదర్ ఆంధ్రాలో అయితే చెప్పు చేసి పెడతా. తెలంగాణలో కష్టం. పని అవుతుందో కాదో తెలీదు. చెప్పి పరువు పోగొట్టుకోవడం కంటే నీ ప్రయత్నాలు నువ్వే చేసుకో అంటూ సైడయిపోతున్నారట. సినిమా ఇండస్ట్రీ అన్నాక అమ్మకాలు, లావాదేపీలు, ఆస్తులకు కొనుగోళ్లు, వ్యాపారాల్లో పలుకుబడి ఇలా చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ హైదరాబాదులో ఉంటూ ఎవరికీ ఏమీ కాకుండా పోతున్నాం. అని చాలామంది టాలీవుడ్ ప్రముఖులు బాధపడుతున్నారని తెలిసింది.
 
ఇంత పాపులారిటీ ఉండి కూడా డ్రగ్స్ కేసులో ఏమీ చేయలేకపోయాం. అంటే నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉండబట్టే కదా. అదే ఏ విజయవాడో, హైదరాబాదో అయితే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదా అవ్వనిచ్చేవాళ్లమా అంటూ మనోవేదన పడుతున్నారట. పోదాం బాస్ ఇప్పటికీ మించిపోయింది ఏదీ లేదు. వైజాగ్ కూడా రమ్మని పలుస్తోంది. చిన్నగా షిప్టు అయిపోదాం, అంటూ అర్థరాత్రి పూట మంచి కిక్‌లో టాలీవుడ్ పెద్దల మధ్య హాట్ డిస్కస్ జరిగింది.
 
డ్రగ్స్ అంటేనే సినిమా ఇండస్ట్రీ. సినిమా వాళ్లంటే ఏపీ వాళ్లు అనేలా చిత్రీకరిస్తున్నారు. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే మార్పును కూడా స్వాగతించాలి. దశాబ్దాలుగా కాస్మెటిక్స్ కల్చర్‌కు అలవాటుపడిన సినీ పరిశ్రమ ఒక్కసారే అన్నీ మానేసి ఇంట్లో కూర్చోవాలంటే కష్టం కదా. చెన్నయ్ నుంచి హైదరాబాద్ రాలేదా.. అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళదాం. జస్ట్ ఫర్ చేంజ్. ఏపీ అన్నా ఏపీ జనం అన్నా సముద్రంలో చేపల్లాంటి వాళ్లు. అన్ని తీరాలూ తిరిగి రావలసిందే. అని టాలీవుడ్ పెద్దలు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు మరి.

చూస్తూ ఉంటే డ్రగ్స్ కుంబకోణంలోని నేరమయ కోణం పక్కకు పోయి ప్రాంతాల మద్య ఇజ్జత్ సమస్యగా ఈ వ్యవహారం మారేటట్టుంది. ఏంటో.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరీ అన్నయ్యా నేను మీకు ద్రోహం చేశాను క్షమించండి. విలపించిన సుబ్బరాజు