ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (cannes film festival 2025) అంటే అంతర్జాతీయంగా అదో సెలబ్రిటీల వేడుక. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ పైన సెలబ్రిటీలు తమతమ స్టైల్స్ చూపిస్తూ ఫ్యాషనబుల్ దుస్తుల్లో హొయలు పోతుంటారు. ఐతే రానురాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పైన ఆయా నటీమణులు చిత్రమైన పోకడలు పోవడం కనబడుతోంది. కొంతమంది మరీ పలుచగా వుండే దుస్తులలో తమ అందాలన్నీ చూపిస్తూ వాక్ చేయడం చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన వేషధారణ చేస్తూ షాకిస్తున్నారు. తాజాగా భారతదేశ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) వాళ్లందరినీ మించిపోయి కొత్త స్టైల్ ప్రదర్శించింది.
ఇండియన్ లెహంగాలో డీప్ నెక్ జాకెట్ వేసుకుని మ్యాచింగ్ ఇండియన్ ఆభరణాలు ధరించింది. ఐతే మెడలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి (Narendra Modi) ఫోటోలతో కూడిన దండను వేసుకున్నది. ఆ దండలోని ఫోటోలు ఆమె ఎద ఎత్తులపై అటుఇటూ కదలాడుతూ వున్నాయి. ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో ఆమెపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. స్పెషల్ ఎట్రాక్షన్ కోసం ఇంతలా దిగజారిపోవాలా అంటూ ఒకరు కామెంట్ చేయగా ఏమ్మా.. నీకేమైనా ఎంపి, ఎమ్మెల్యే టికెట్ కావాలా ఏంటి అంటూ మరొకరు కామెంట్ పోస్ట్ చేసారు. ఐతే.. రుచి గుజ్జర్ మాత్రం దిసీజ్ మై ఫ్యాషన్ పవర్ అంటోంది.