ప్రపంచంలో సెక్సీ మహిళ్లో హాలీవుడ్ నటి, గాయని స్కార్లెట్ జాన్సన్‌కు ప్రత్యేక స్థానముంది. ఈమె గ్లామర్‌కు కారణమేమిటో తెలుసుకునేముందు.. ఆమె సెక్సీ లుక్‌తో స్కార్లెట్‌కు ఏర్పడిన నష్టమేమిటో తెలుసుకోండి.
సెక్సీగా ఉండటం వల్ల పలు ఛాన్సులు వెతుక్కుంటూ రావడం పరిపాటి. కానీ స్కార్లెట్ జాన్సన్ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. సెక్సీ అప్పీలుతో స్కార్లెట్ జాన్సన్‌కు అంతగా అవకాశాలు రాలేదు. అయితే అమ్మడు మాత్రం ఛాన్సులు రాకపోవడంపై బాధగా లేదని, ప్రస్తుతానికి ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు రెడీగా ఉన్నానని సమర్థించుకుంటోంది.
స్కార్లెట్ జాన్సన్ సెక్సీగా కనిపించేందుకు ప్రత్యేకంగా డయట్ ఫోలో చేయలేదట. తాను ఇష్టపడిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు వైన్ తీసుకుంటాను. సాధారణంగా తనకు డయట్ అంటే ఇష్టముండదు.
అలాగే నాన్ వెజ్, పాలతో చేసిన ఉత్పత్తులను మాత్రం అస్సలు తీసుకోను అని స్కార్లెట్ జాన్సన్ చెప్పింది. మరి సెక్సీగా మారాలనుకునే ముద్దుగుమ్మలు ఈ డయట్‌ను ఫాలో చేయండి..