వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం అంటేనే అంటే విఐపిలకు పండుగ. ఇక రెండు పండుగలు ఒకేసారి వస్తే, ఇక సందడే సందడి. టీటీడీ అధికారులకు ఎక్కడ లేని తిప్పలు తప్పవు. మరి అలాంటిది తక్కువ పాసులతో విఐపిలను కట్టడి చేసిందంటే నమ్ముతారా.. ఇది నిజం కేవలం 2474 మంది విఐపిలకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కలిగించి రికార్డు సృష్టించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారం రోజుల నుంచే ఏకాదశి దర్శనా కసరత్తు చేసింది. సాధారణంగా అయితే విఐపిలు ఆదింది ఆట. పాడింది. పాటగా నడుస్తుంది. నిర్ణీత సంఖ్యలో మాత్రమే దర్శనానికి తీసుకురావాలని విఐపీలకు చెప్పినా వారు వినే వారు కాదు. కానీ ఈ పర్యాయం వారితో సహా నలుగురంటే నలుగురికే అనుమతినిస్తామని తెగేసి చెప్పారు. అదే విధంగా వ్యవహరించారు. స్వయంగా వారు వస్తే తప్ప టికెట్లు ఇవ్వకపోవడంతో చాలా మటుకు విఐపిలు తగ్గారు.
ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ రోహిణి, వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, డీకే అరుణ, మహేందర్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.