Publish Date: Tue, 19 May 2015 (11:07 IST)
Updated Date: Tue, 19 May 2015 (11:09 IST)
తిరుమల శ్రీవారిని పలురువు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, తనయుడు అనంత్ అంబానీ, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే దర్శించుకున్నారు.
సోమవారం సాయంత్రమే తిరుమల చేరుకున్న వారు అక్కడే బస చేశారు. ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శనం కలిగించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.