Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో నూతన దంపతులకు విఐపి దర్శనం.. తిరుపతిలో వివాహ వేదిక.. టూరిజం యోచన..?

Advertiesment
VIP dharshan
, బుధవారం, 22 జులై 2015 (06:48 IST)
ఈ మధ్య కాలంలో తిరుమలలో వివాహం చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందనీ వారి కోసం తిరుపతిలో వివాహవేదిక నిర్మించాలని ప్రతిపాదించామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ వెల్లడించారు. వివాహం అనంతరం కొత్త దంపతులు, ఇరువైపుల తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి తిరుమలలో వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలలో పొందుపరుస్తున్నామని వెల్లడించారు.
 
తిరుపతిలో పర్యాటక రంగాన్ని విస్తృత పరచడానికి ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. పర్యాటకాభివృద్ధిపై సీఐఐ విశాఖ చాప్టర్‌ మంగళవారం పార్కు హోటల్‌లో నిర్వహిం చిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది వారి పిల్లలకు తిరుపతిలో వివాహం జరి పించాలని కోరుకుంటున్నారని తెలిపారు.  
 
దీని కోసం త్వరలో తిరుపతిలో టూర్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయడంతోపాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు. దీనికి ప్రాంతాలవారీగా టూరిజం ప్రమోషన్‌ బ్యూరోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu