Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవిందా.. నీకు రెస్టుందా.... ! తిరుమలలో కైంకర్యాలకు కోత

Advertiesment
Venkateswara swamy
, గురువారం, 18 జూన్ 2015 (09:16 IST)
రద్దీ పెరిగిందో భక్తుల అగచాట్ల సంగతి ఏమో కానీ వేంకటేశ్వర స్వామికి నిద్ర తగ్గిపోతుంది. అందులో అనుమానం లేదు. క్రమేణ పెరుగుతున్న రద్దీ మిసతో ఇంతమందికి దర్శనం చేయించామని చెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులు వ్యక్తిగత రికార్డుల కోసం మూలవిరాట్టు పూజా కైంకర్యాల్లో కోత పెడుతున్నారు.  స్వామికి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఇది తప్పు వద్దని ఆగమపండితులు పీఠాధిపతులు ఎంత వారిస్తున్నా పట్టించుకునే పరిస్థితులలో అధికారులు పాలకులు లేరు. 
 
గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు పూజా కైంకర్యాలన్నీ వైఖానస ఆగమ నిబంధనల మేరకు వేకువజాము మొదలుపెడతారు. తిరిగి అర్ధరాత్రి వరకు ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి కైంకర్యాలు ప్రతిరోజూ రెండుసార్లు, తోమాల ఒకసారి, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు, తగినంత విరామ సమయం కేటాయించాలి. 24 గంటల్లో గర్భాలయ మూలమూర్తికి గరిష్టంగా 10 గంటలు, కనిష్టంగా 6 గంటలకు తక్కువ కాకుండా పూజా కైంకర్యాలు, విరామ సమయం కేటాయించాలి.
 
అయితే, భక్తుల రద్దీ కారణంగా వారందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పూజా నివేదనలతోపాటు విరామ సమయాన్నీ తగ్గిస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించామనే తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆగ మ నిబంధనల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శ లున్నాయి. గత శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిర్వహించాల్సిన ఏకాంత సేవ ఆదివారం వేకువజామున 1.45 గంటలకు ప్రారంభించడం, ఆ వెనువెంటనే విరామం లేకుండా సుప్రభాతం మరుసటి రోజు పూజలు ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu