తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం రవాణ సౌకర్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. బాలాజీ బస్సు స్టేషనులో అదనపు బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త వహించాలని కోరారు. బ్రహ్మోత్సాల సమయంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని, అందుకే తగు జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తదితరలు పాల్గొన్నారు.