Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇది పూర్వజన్మ సుకృతం : శ్రీవారిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్ చదలవాడ

Advertiesment
ttd
టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేసిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. వైకుంఠం కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఆయన విఐపి విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను టిటిడి ఛైర్మన్ వడమనేది తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దయవల్లే తనకు తితిదే పాలకమండలి ఛైర్మన్‌గా అవకాశం కలిగిందని తెలిపారు. వేంకటేశ్వర స్వామి వద్ద తాను ఓ సాధారణ భక్తుడిలా ఉండి సేవచేస్తానన్నారు. మే 2వ తేదీ ఉదయం 11.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చదలవాడ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu