తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నేడు కొలువదీరనున్నది. ఛైర్మన్ సహా పలువురు సభ్యులు తిరుమల ఆలయంలో ప్రమాణస్వీకారం చేస్తారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తిచేసింది. వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమించింది. పాలకమండలి అధ్యక్షులుగా మాజీ మంత్రి చదలవాడ క్రిష్ణమూర్తి ఎంపికయ్యారు. ఆయనతోపాటు సినీ దర్శకుడు రాఘవేంధ్రరావు, పలువురు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఎంపికయ్యారు.
వీరిలో చాలామంది నేడు ఉదయం 11.15 గంటలకు గుడి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం లాంఛనంగా సమావేశమవుతారు. గుడిలో జరిగే కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్ధానం ఏర్పాట్లు పూర్తి చేసింది.