తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం తిరుమాడ వీధులలో రథోత్సవం జరుగనున్నది. రథోత్సవానికి తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఉంది. స్వామి వారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడుతుంటారు.
దేవతలందరూ కలసి శ్రీనివాస మూర్తిని రథంలో కూర్చోబెట్టి ఊరేగించారట. అందుకే బ్రహ్మోత్సవాలలో తాము ఓ చేయి వేసి రథాన్ని లాగితే తమకు పుణ్య దక్కుతుందని భక్తులు పోటీ పడుతుంటారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీటీడీ ప్రజా సంబంధాల అధికారి రవి విడుదల చేశారు.
వాహన మండపం నుంచి గొల్ల మండపం వరకూ చాలా ఇరుకుగా ఉన్న కారణంగా భక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రథాన్ని అటు ఇటు నిలవద్దని చెబుతున్నారు. రథం కుడి వైపు తిరిగే సమయంలో కుడివైపున నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. రథంపైకి నాణేలు కానీ, మిరియాలు కానీ చల్లవద్దని చెబుతున్నారు. దీనివలన రథంపై ఉన్న అర్ఛకులను గాయపరిచే అవకాశం ఉందని వివరిస్తున్నారు.