Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారు కోటి మన్మథ సదృశుడు...? బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ...

శ్రీ మహావైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన శ్రీహరి సాక్షాత్తు కొలువై ఉంటూ దివ్యదర్శనమిస్తున్న సుప్రసిద్థ స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. కోటి మన్మథ సదృశుడై అత్యంత మోహనరూపంతో కేవలం ఆ హరి కొలువై ఉండడమే కాదు... మానవులందరి వేం-పాపాలను, కట-నశింపజేసే వేంకటపతిన

తిరుమల శ్రీవారు కోటి మన్మథ సదృశుడు...? బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ...
, శుక్రవారం, 22 జులై 2016 (14:54 IST)
శ్రీ మహావైకుంఠం నుండి భువికి దిగి వచ్చిన శ్రీహరి సాక్షాత్తు కొలువై ఉంటూ దివ్యదర్శనమిస్తున్న సుప్రసిద్థ స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. కోటి మన్మథ సదృశుడై అత్యంత మోహనరూపంతో కేవలం ఆ హరి కొలువై ఉండడమే కాదు... మానవులందరి  వేం-పాపాలను, కట-నశింపజేసే వేంకటపతిని తానేనంటూ ఆ మహావిష్ణువు చాటుకుంటూ ఈ కలియుగంలో అందరి పాలిట పెద్దదిక్కై కలౌవేంకటనాయక అన్న బిరుదుతో సార్థకనామధేయుడై కీర్తి ప్రతిష్టలందింన స్వామి తిరుమల శ్రీనివాసుడు.
 
శేషాచలం, గరుడాచలం, వేంకటాచలం, నారాయణచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం అనే ఏడుకొండల మధ్య వెలసి ఉన్నందువల్ల ఏడుకొండలవాడని, సప్తగిరీశుడని, వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మిని ధరించినందువల్ల శ్రీనివాసుడనీ, తిరుమలలో నిలిచి ఉన్నందువల్ల తిరుమలేశుడని, తిరుమలప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తులచే పిలువబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారు కోరిన వారి కల్పతరువు. పట్టిన వారి చేతి బంగారం. ముట్టి కొలిచిన వారి ముందుజీతం. సేవ చేసిన వారి చేతిలోని మాణిక్యం. భావించువారి పరబ్రహ్మ. కావలెనన్నవారికి మనోరథ సిద్ధినిచ్చే గురుతైన దైవం. తన్మయించి సుతియించేవారి ఆనందరూపం. 
 
భూమండలంపై 13 డిగ్రీల 40 - 79డిగ్రీల 20 అక్షాంశరేఖాంశాల మీద సముద్ర మట్టానికి 2,800 అడుగులు మొదలు 3,600 అడుగుల ఎత్తు వరకు నెలకొని వ్యాపించి ఉన్న సప్తగిరుల శిఖర శ్రేణుల మధ్య శ్రీ మహావిష్ణువు స్వయంభువై వెలసి ఆనందనిలయమనే బంగారు మేడలో దివ్యదర్శనం ఇస్తూ ఉన్నాడు. అదిగో.. కన్నులు మిరుమిట్టులు గొలిపేలా కోటి సూర్యతేజంతో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్న బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ.
 
బంగారు మేడ. అందులోని ఒక్కొక్క మండపం ఒక్కొక్క భక్తుని త్యాగానికి ప్రతీక. భక్తికి నిదర్శనం. ఆ భవనంలోని ప్రతి అడుగడుగూ భక్తుల విచిత్ర పట్టుగొమ్మలు. ప్రతి అణువణువూ ఆ గోవిందుని వర ప్రసాదానికి, భక్తానుగ్రహశీలానికి తార్కాణాలు. తరతరాలుగా ఎందరో భక్తులు తిరుమలేశునికి తమ తనువులనూ, మనసులనూ మీదుకట్టి గుండెలనిండుగా నింపుకొన్న ఆ బంగారు మేడ లోనికి ప్రవేశిద్దాం. గోవిందా..గోవిందా...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల కొండపై నో ఫ్లై జోన్‌ కుదరదంటే ఎలా? కేంద్రమంత్రి ప్రశ్నించరా...?