Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందువులు తమ పిల్లలకు పెట్టకూడని పేర్లేంటో తెలుసా?

నిజానికి తమ పిల్లలకు పేర్లు పెట్టాలంటే తల్లిదండ్రులు అనేక విషయాలు ఆలోచన చేస్తారు. పుట్టిన తేదీ, సమయం, రోజు, నక్షత్రం, రాశి తదితరాలను పరిశీలిస్తుంటారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు దేవుడి పేరు లేదా వాళ్ళ

హిందువులు తమ పిల్లలకు పెట్టకూడని పేర్లేంటో తెలుసా?
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (16:41 IST)
నిజానికి తమ పిల్లలకు పేర్లు పెట్టాలంటే తల్లిదండ్రులు అనేక విషయాలు ఆలోచన చేస్తారు. పుట్టిన తేదీ, సమయం, రోజు, నక్షత్రం, రాశి తదితరాలను పరిశీలిస్తుంటారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు దేవుడి పేరు లేదా వాళ్ళ పెద్దవారి పేర్లు పెడుతుంటారు. ఏ పేరు పెట్టినా పిల్లలు బాగుండాలనే ఆశించి పెడారు. కానీ, హిందువులు తమ పిల్లలకు కొన్ని పేర్లు పెట్టరు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.! 
 
తమ పిల్లలకు పెట్టని పేర్లలో ప్రధానంగా ముందు ఉండే పేరు అశ్వత్థామం. ఈయన ద్రోణాచార్యుడి కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమాన్యుడి భార్య ఉత్తరగర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. దీంతో శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురవుతాడు. కలియుగం అంతమయ్యేంత వరకు లోకంలో జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని వసుదేవుడు శపిస్తాడు. 
 
సుగ్రీవుడు : రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టుచాటు నుంచి చంపించి, అధర్మయుద్ధం చేసి గెలిచి, రాజ్యం సాధిస్తాడు కాబట్టి ఇతని పేరు పిల్లలకు పెట్టరు. 
 
విభీషణుడు: ఈయన స్వతహాగా మంచివాడే. కానీ సొంత అన్న అయిన రావణునికి వ్యతిరేకంగా వెళ్లి రాముడితో చేతులు కలుపుతాడు. అన్న ఎలాంటివాడైనా కూడా అన్నను మోసం చేసి రాముడితో కలవడం వల్ల ఇతని పేరును కూడా ఎవరూ పెట్టుకోరు. 
 
శకుని: శకుని పేరు పెట్టుకోవడానికి ఏ ఒక్క హిందువూ ఇష్టపడరు. ఎందుకంటే ఇతను తన మాయా పాచికలతో జూదంలో పాండవులను ఓడించి.. కౌరవుల వెంటవుండి వారి వినాశనానికి కారణభూతుడుగా నిలుస్తాడు.
 
దుర్యోధనుడు : ఇతని మోసాలు వలన పాండవులు అడవుల పాలవుతారు. రాజ్యాన్ని కోల్పోతారు. బహు మోసకారి. అందుకే ఈయన పేరును ఎవ్వరూ పెట్టుకోరు. 
 
ద్రౌపది (ద్రౌపతి): ఈమె పంచ పాండువులకు భార్య. ఐదుగురు భర్తలకు భార్య కావడంతో హిందువులు తమ పిల్లలకు ఈ పేరు పెట్టరు. 
 
మండోదరి : ఈమె చాలా మంచిది. పైగా సహనశీలి. అయినా కూడా ఆమె రావణుడి వంటి రాక్షసుడికి భార్య. దీంతో ఈమె పేరు పెట్టుకోరు. 
 
మందర : ఈమె బుద్ధి చెడు కోరుతుంది. ఈమె కైకేయికి లేనిపోనివి ఎక్కించి, రాముడు అడవులకు వెళ్లడానికి కారణమైంది. అందుకే ఈమె పేరు పెట్టుకోరు. 
 
కైకేయి : ఈమె రాముడు అడవులకు వెళ్లడానికి కారణభూతురాలు. అందుకని ఎవరూ ఈమె పేరును పెట్టుకోరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయిందా అయితే శుక్రవారం తలస్నానం చేయకండి...